సిద్ధాపూర్ సర్పంచ్‌గా సునీత విజయం
KMR: సిద్ధాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి సునీత ఘన విజయం సాధించారు. సునీత తన సమీప ప్రత్యర్థి ఎక్లార సురేఖపై భారీ మెజార్టీతో గెలుపొందారు. సునీతకు 211 ఓట్ల మెజార్టీ లభించినట్లు అధికారులు ధ్రువీకరించారు. ఈ విజయంతో సిద్ధాపూర్ కాంగ్రెస్ వర్గాల్లో ఉత్సాహాన్ని నింపింది.