కనగల్ వాగులో వ్యక్తి మృతి
NLG: కనగల్ వాగులో అదే గ్రామానికి చెందిన చిట్టిమల్లె పెద్దలు మృతి చెందారు. నాలుగు రోజుల క్రితం పొలానికి వెళ్లి తిరిగి రాలేదు. బుధవారం పశువుల కాపరులు ఆయన మృతదేహాన్ని గుర్తించారు. వాగు దాటుతుండగా వరద ఉధృతికి కొట్టుకుపోయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. మృతుడికి ఈత రాదని తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.