CMRF చెక్కులను పంపిణీ చేసిన నాయకులు

CMRF చెక్కులను పంపిణీ చేసిన నాయకులు

GNTR: దుగ్గిరాల మండలం పేరుకలపూడిలో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను టీడీపీ నాయకులు సోమవారం భాదితుల ఇంటికి వెళ్ళి పంపిణీ చేశారు. పేరుకలపూడికి చెందిన కాజ కోటేశ్వరరావుకి రూ. 64,928, అంగిరేకుల సౌజన్యకు రూ. 58,018ల విలువ గల చెక్కులను వారు అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.