భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పూజలు

KDP: సిద్దవటం మండలంలోని మాధవరం-1 గ్రామపంచాయతీ పార్వతీపురం గ్రామంలో వెలసిన శ్రీ గంగాభవాని అమ్మవారికి శుక్రవారం భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకం, అలంకరణ, సహస్రనామార్చన, కుంకుమార్చన వంటి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.