'100 రోజుల కూటమి పాలన అప్పుల మయం'

'100 రోజుల కూటమి పాలన అప్పుల మయం'

KDP: ఎపీలో 100 రోజుల కూటమి ప్రభుత్వ పాలనలో మొత్తం అప్పుల మయమేనని, ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. కడప వైసీపీ కార్యాలయంలో శుక్రవారం మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో కేవలం ఫించన్ పెంచి ఇచ్చారని, అవి కూడా అనేక మంది లబ్ధిదారులను తొలగించి ఇచ్చారన్నారు. అనేక పథకాలు ఇవ్వలేదని విమర్శించారు.