అంబటి రాజకీయాలపై టీడీపీ ఆగ్రహం

అంబటి రాజకీయాలపై టీడీపీ ఆగ్రహం

GNTR: పొన్నూరులో వ్యక్తుల మధ్య జరిగిన గొడవను వైసీపీ నేత అంబటి మురళి రాజకీయం చేస్తున్నారని టీడీపీ ఎస్సీ సెల్ నేతలు మండిపడ్డారు. ఎమ్మెల్యే ధూళిపాళ్లపై బురద చల్లేందుకే ఈ ప్రయత్నమని విమర్శించారు. నేర చరిత్ర ఉన్నవారికి మద్దతుగా మురళి ధర్నాలు చేయడం విడ్డూరమన్నారు. గొడవలకు పార్టీ రంగు పులిమి ప్రజలను రెచ్చగొట్టడం తగదని, డ్రామాలు కట్టిపెట్టాలన్నారు.