'అధిక చార్జీలు వసూలు చేస్తే చర్యలు'
CTR: సంక్రాంతి పండుగకు వచ్చే ప్రయాణికుల నుంచి ప్రవేట్ బస్సుల వారు అధిక చార్జీ వసూలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పుంగనూరు MVI సుప్రియ హెచ్చరించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రయాణ సమయంలో ప్రయాణికులకు అసౌకర్యం కలిగించినా చర్యలు తప్పవన్నారు. వాహనాలకు సరైన రికార్డులు లేకపోయినా నిబంధనలకు విరుద్ధంగా బస్సులు తిరుగుతున్నా జప్తు చేస్తామని స్పష్టం చేశారు.