దేవాదుల పంపు హౌస్‌ను సందర్శించిన మంత్రులు

WGL: దేవన్నపేట దేవాదుల పంపు హౌస్‌ను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి శనివారం సందర్శించి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. దేవాదుల ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేయాలన్నదే లక్ష్యమని, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.