టీడీపీ లీగల్ సెల్‌కు సీఎం అభినందనలు

GNTR: ఉండవల్లి నివాసంలో టీడీపీ లీగల్ సెల్ సభ్యులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ లీగల్ సెల్ సభ్యులను సీఎం అభినందిచారు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, ఎన్నో పోరాటాలు చేయాల్సి వచ్చిందని చంద్రబాబు తెలిపారు. ఈ పోరాటంలో పార్టీ లీగల్ సెల్ చేసిన కృషి ప్రశంసనీయమని సీఎం కొనియాడారు.