'మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది'
SKLM: మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని నరసన్నపేట ఎమ్మెల్యే రమణమూర్తి అన్నారు. సోమవారం పోలాకి మండలం రాజా రాంపురం గ్రామంలో మత్స్యకారులకు ఉచిత నిత్యవసర సరుకులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లు మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమంపై నిర్లక్ష్యం చేసిందన్నారు.