రైలు కిందపడి 10 ఆవులు మృతి
అన్నమయ్య: ఓబులవారిపల్లి మండలం చిన్నమండెం పంచాయతీ పరిధిలోని ZHDC కాలనీ సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్ వద్ద శనివారం మేతకు వెళ్లిన ఆవులు ప్రమాదవశాత్తు రైలు ఢీకొనడంతో పది ఆవులు మృతి చెందాయి. రైల్వే ట్రాక్ దాటే క్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఒకేసారి 10 ఆవులు మృతి చెందడంతో గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.