లోక్ అదాలత్‌లో 663 కేసులు పరిష్కారం
కోనసీమ: రాజోలు కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ ద్వారా 663 కేసులు పరిష్కారం అయ్యాయని సీనియర్, జూనియర్ సివిల్ జడ్జిలు ఎం.ప్రమీల రాణి, కె.హిమబిందు తెలిపారు. ఈ కేసులకు సంబంధించి రూ.63.8 లక్షలు పరిష్కరించామని తెలిపారు. ఈ అదాలత్ లో సివిల్, క్రిమినల్, ప్రిలిటికేషన్ కేసులను ఇరు పార్టీల అంగీకారంతో పరిష్కరించామన్నారు.