ఉగ్రవాదాన్ని ఉసిగొల్పడం పాక్ మానదు: పంకజ్
భారత్‌పై ఉగ్రవాదాన్ని ఉసిగొల్పడం పాకిస్తాన్ ఎన్నటికీ వదిలిపెట్టదని మాజీ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, NSI బోర్డు సభ్యుడు పంకజ్ సరన్ పేర్కొన్నారు. కేవలం ఉగ్ర స్థావరాలు మారుస్తూ కొత్త విధానాలు, సాంకేతికతలను ఉపయోగిస్తుందన్నారు. 26/11 ముంబై దాడులకు 17 ఏళ్లయిన నేపథ్యంలో మాట్లాడారు. 1947 నుంచి ప్రతిస్పందన తీరులో గణనీయ మార్పు వచ్చిందన్నారు.