ధాన్యం కొనుగోలు కేంద్రాలపై DRDO వై.శేఖర్‌రెడ్డి ఆదేశాలు
NLG: జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (DRDO) వై.శేఖర్‌రెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నల్గొండలో జరిగిన శిక్షణలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 161 కొనుగోలు కేంద్రాలు మంజూరు చేశామని, కొనుగోళ్లలో పారదర్శకత పాటించాలని, రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని పీపీసీ నిర్వాహకులకు, మహిళా సమాఖ్య ప్రతినిధులకు సూచించారు.