'ఆంధ్రకేసరి జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకం'

ప్రకాశం: టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా మంత్రి బాలవీరాంజనేయ స్వామి నివాళులర్పించారు. ఇందులో భాగంగా ఆయన తెలుగువారి సాహసానికి, పౌరుషానికి ప్రతీక అని మంత్రి కొనియాడారు. ఈ మేరకు తుపాకీకి ఎదురు వెళ్ళి పోరాడిన ఆంధ్రకేసరి జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకం అన్నారు. అనంతరం సంపాదనంతా ప్రజా సంక్షేమానికి ఖర్చు పెట్టారని నివాసాన్నే ఉద్యమానికి శిబిరంగా మార్చుకున్నారని వివరించారు.