ముగిసిన అందెశ్రీ అంత్యక్రియలు
TG: కవి అందెశ్రీ అంత్యక్రియలు ఘట్‌కేసర్‌లో అధికారిక లాంఛనాలతో ముగిశాయి. అంతిమ యాత్రలో సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు, అందెశ్రీ అభిమానులు, సాహితీ ప్రియులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. 2 నిమిషాలు అందరూ మౌనం పాటించగా.. పోలీసులు గాల్లోకి 3 రౌండ్లపాటు గౌరవ సూచికంగా కాల్పులు జరిపారు. అనంతరం అందెశ్రీ కుమారుడు ఆయన చితికి నిప్పు పెట్టడంతో అంత్యక్రియలు ముగిశాయి.