మర్తాడులో సమస్యలపై వినతి

మర్తాడులో సమస్యలపై వినతి

ATP: గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామంలో సాగునీరు, త్రాగునీరు, రోడ్డు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉమ్మడి అనంతపురం జిల్లా ఏడీసీసీ బ్యాంకు ఛైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డిని రైతులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కలిశారు. అనంతపురం పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షులు ఆవుల కృష్ణయ్య, మాజీ మండల కన్వీనర్ గోరకాటి వెంకటేష్‌ తదితరులు కలిసి వినతిపత్రం అందజేశారు.