VIDEO: ఇంట్లో గొడవ.. బాలుడు ఆత్మహత్యాయత్నం

VIDEO: ఇంట్లో గొడవ.. బాలుడు ఆత్మహత్యాయత్నం

SRD: కంగ్టి మండలం సుక్కల తీర్థ్ గ్రామంలో గురువారం సాయంత్రం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గణపతి (14) ఇంట్లో జరిగిన గొడవ కారణంగా పెట్రోల్, పురుగుల మందు కలిపి సేవించినట్లు తెలిసింది. బాలుడు అస్వస్థతకు గురికావడంతో స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఈఎంఎటీ సిబ్బంది ఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.