మంత్రి రాంప్రసాద్ రెడ్డిని కలిసిన ఫైర్ అధికారులు
అన్నమయ్య: చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లెలోని మంత్రి స్వగృహంలో జిల్లా ఫైర్ అధికారులు మంత్రి రాంప్రసాద్ రెడ్డిని ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూల బొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఫైర్ సిబ్బంది ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారని మంత్రి ప్రశంసించారు. అగ్ని ప్రమాదాల సమయంలో వేగవంతంగా, సమర్థవంతంగా స్పందించాలని సూచించారు.