కోదండరాముడి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ

కోదండరాముడి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ

PLD: మాచర్ల మండలం గన్నవరంలోని శ్రీ సీతా సమేత కోదండరామస్వామి ఆలయంలో ధ్వజస్తంభ పునః ప్రతిష్ఠ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొని హోమాల్లో నవ ధాన్యాలు, ఆవు నెయ్యి సమర్పించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే వెంట పలువురు నాయకులు ఉన్నారు.