మే 14వ తేదీ నుంచి డిగ్రీ పరీక్షలు

KNR: కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని డిగ్రీ కళాశాలలో డిగ్రీ 2వ, 4వ, 6వ సెమిస్టర్ పరీక్షలు మే 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్టు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి డా. డి సురేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష సమయ వేళలు త్వరలో ప్రకటిస్తామని, విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు.