దొంగ బిల్లులతో దోచుకుంటున్నారు: కాకాణి
NLR: సర్వేపల్లి పరిధిలోని ఇరిగేషన్ బిల్లుల్లో భారీ అవినీతి జరిగిందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. డేగపూడిలో కూలిపోయిన వంతెన, రోడ్డు పరిస్థితిని పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. దొంగ బిల్లులతో ఎమ్మెల్యే సోమిరెడ్డి రూ.కోట్లు దోచుకుంటున్నారన్నారు. ఈ మేరకు దేవాదాయ ఆస్తులను కూడా కాజేస్తున్నారని విమర్శించారు.