పొలంలో కొండచిలువ కలకలం

పొలంలో కొండచిలువ కలకలం

KNR: శంకరపట్నం మండలంలో ఓ రైతు పంట పొలాన్ని కోస్తుండగా కొండచిలువ ప్రత్యక్షమైంది. రైతు గడ్డి రమేష్ కథనం ప్రకారం.. ఉదయం పొలం కోయడానికి హార్వెస్టర్ తీసుకుని వెళ్లి పొలం కోస్తుండగా భారీ కొండచిలువ మరో పామును మింగుతూ కనిపించడంతో భయభ్రాంతులకు గురైనట్లు తెలిపారు. ఈ క్రమంలో పొలంలోకి వెళ్లిన ట్రాక్టర్ కింద కొండచిలువ పడి చనిపోయినట్లు తెలిపాడు.