పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు.. పాస్టర్‌పై కేసు
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాస్టర్‌పై కేసు నమోదైంది. కోనసీమ జిల్లా దంగేటివారిపాలెం చర్చిలో సనాతన ధర్మంపై పాస్టర్ డేనియల్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంపై కేసు నమోదైంది. పాస్టర్ చంటి దొర అలియాస్ డేనియల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.