'పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి'
BDK: జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలను మార్చి 14, ఏప్రిల్ 16 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పకడ్బందీగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీవోసీ కార్యాలయంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.