'ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం'

'ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం'

BDK: జిల్లా నిరుద్యోగులకు ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు ఐటీసీ ప్రథమ ఎడ్యుకేషన్ జిల్లా కోఆర్డినేటర్ వెంకట్రామ్ అన్నారు. ఎలక్ట్రిషన్, బ్యూటీషియన్, నర్సింగ్, హోటల్ మేనేజ్‌మెంట్, మెకానికల్, డీఈవో కోర్సులు ఉన్నాయన్నారు. ఉచిత భోజన వసతితో 45 రోజుల శిక్షణ ఉంటుందన్నారు. 18-35 వయసు, ఐటీఐ, డిప్లమా, డిగ్రీ చదివిన వారు అర్హులని తెలిపారు.