పదోన్నతులు మరింత బాధ్యతలు పెంచుతాయి

పదోన్నతులు మరింత బాధ్యతలు పెంచుతాయి

WGL: పదోన్నతులు మరింత బాధ్యతలు పెంచుతాయని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. కమిషనరేట్ పరిధిలో ఎస్సైలుగా పదోన్నతి పొందిన రాజ, జయకుమార్, రాజమౌళి, సారయ్య, నరేంద్ర చారి నేడు సీపీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఈ సందర్భంగా పదోన్నతి పొందిన అధికారులను సీపీ అభినందించారు.