VIDEO: పట్ట పగలు వెలుగుతున్న వీధి దీపాలు
VSP: మాధవధార ఉడా కాలనీలో పట్టపగలు వీధి దీపాలు వెలుగుతున్నాయి. ఇవాళ ఉదయం 8 గంటలు అయినప్పటికీ లైట్లు ఆగకపోవడంతో పాదాచారులు, వాహనదారులు విమర్శిస్తున్నారు. వేసవి దృష్ట్యా విద్యుత్ ఆదా చేయాలని చెబుతున్నా అధికారులు పాటించడం లేదని మండిపడుతున్నారు. పగటిపూట వీధి దీపాలు వెలగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.