ఈ నెల 19న కర్నూల్ డివిజన్‌లో డాక్ అదాలత్

కర్నూలు: జిల్లాలోని ప్రధాన పోస్టల్ కార్యాలయంలో డాక్ అదాలత్ నిర్వహించనున్నారు. ఈనెల 19న ఉదయం 11గంటలకు నిర్వహిస్తున్నట్లు డివిజన్ ప్రధాన పర్యవేక్షకులు జనార్ధన్ రెడ్డి తెలిపారు. తపాలా శాఖ అందించే సేవల్లో లోపాలపై ఫిర్యాదు చేయవచ్చన్నారు. తపాలా ద్వారా ఫిర్యాదులు పంపాలనుకునేవారు పోస్టు కవర్‌పై డాక్ ఆదాలత్ అని రాసి సమస్యను వివరిస్తూ ఈనెల 15వలోగా పంపాలన్నారు.