కోతుల దాడిలో వృద్ధురాలికి గాయాలు

కోతుల దాడిలో వృద్ధురాలికి గాయాలు

NRML: కోతుల దాడిలో వృద్ధురాలికి గాయాలైన ఘటన నిర్మల్ జిల్లా కడెం మండలంలో చోటుచేసుకుంది. కడెం మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన దానవేని మల్లమ్మ తన ఇంటి ఆవరణలో పనిచేస్తుండగా ఒక్కసారిగా కోతులు దాడికి తెగబడ్డాయి. ఈ ఘటనలో వృద్ధురాలికి గాయాలు కావడంతో ఖానాపూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.