ద్విచక్రవాహనం అదుపుతప్పి.. యువకుడికి తీవ్ర గాయాలు
ప్రకాశం: కంభం మండలం జంగంగుంట్ల గ్రామ సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం పై వెళ్తున్న యువకుడు అదుపు తప్పి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో ఆ యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన యువకుడు మార్కాపురం మండలం చింతగుంట్ల గ్రామానికి చెందిన ఆకాష్ గా పోలీస్ లు గుర్తించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేశారు.