'ఆస్తి పన్ను వడ్డీలు 50% రాయితీని సద్వినియోగం చేసుకోవాలి'

'ఆస్తి పన్ను వడ్డీలు 50% రాయితీని సద్వినియోగం చేసుకోవాలి'

ATP: రాయదుర్గం మున్సిపాలిటీలో పెండింగ్లో ఉన్న ఆస్తి, కొళాయి పన్ను బకాయిలను చెల్లించాలని కమిషనర్ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లిస్తే వడ్డీలో 50% రాయితీ కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. కావున రాయదుర్గం మున్సిపాలిటీ ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి పాటుపడాలన్నారు.