VIDEO: త్రాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలి: MLA
MDK: కొల్చారం మండలం తుక్కాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. గ్రామాలలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, మిషన్ భగీరథ మెయింటినెన్స్ సరింగా లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలన్నారు.