జీర్ణాశయ క్యాన్సర్ లక్షణాలు ఇవే
గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లెక్స్ వంటి వాటిని జీర్ణాశయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలుగా చెప్పవచ్చు. అలసటగా, అనారోగ్యంగా అనిపించడంతో పాటు ఎప్పుడూ వికారంగా ఉంటుంది. కొన్నిసార్లు రక్తపు వాంతులు అయ్యే అవకాశం ఉంది. అజీర్ణం సమస్య ఎక్కువగా ఉండటం, కడుపు ఉబ్బరం ఎక్కువవ్వడం, కొద్దిగా ఆహారాన్ని తీసుకున్నా కడుపు నిండిన భావన కలగడం వంటివి కూడా జీర్ణాశయ క్యాన్సర్ లక్షణాలుగా చెప్పవచ్చు.