నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

NRML: నిర్మల్ పట్టణంలోని సబ్ స్టేషన్ పరిధిలో మరమ్మతుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని అధికారులు తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆదర్శనగర్, గాయత్రి పురం, రాంనగర్, భాగ్యనగర్, విద్యా నగర్, సోఫీ నగర్, మదీనా కాలనీ, ఇందిరమ్మ కాలనీ, సిద్దాపూర్ తదితర ప్రాంతాల్లో సరఫరా నిలిపివేయనున్నారు. ఈ మేరకు వినియోగదారులు సహకరించాలని కోరారు.