ఐదు గ్యారంటీలతో అస్సాంలో కాంగ్రెస్ పోటీ
ఐదు గ్యారంటీల మ్యానిఫెస్టోతో కాంగ్రెస్ అస్సాం ఎన్నికల్లో పోటీకి దిగింది. మహిళలకు నెలవారీ నగదు బదిలీతో పాటు వ్యాపార విస్తరణకు రూ.50వేల సాయం చేస్తామని ప్రకటించింది. సీనియర్ సిటిజన్లకు నెలకు రూ.1,250 చొప్పున పెన్షన్లు, 100 రోజుల్లోనే సింగర్ జుబీన్ గార్గ్ మృతి కేసులో న్యాయం, రూ.25 లక్షల క్యాష్‌లెస్ ఆరోగ్య బీమా, 10లక్షల మందికి శాశ్వత భూపట్టాలను ఇప్పిస్తామని హామీ ఇచ్చింది.