సిట్ కస్టడీకి వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్న

సిట్ కస్టడీకి వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్న

AP: తిరుమల కల్తీ నెయ్యి కేసులో వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్న సిట్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. 5 రోజుల కస్టడీలో భాగంగా అప్పన్న అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన ప్రీమియర్ అగ్రిఫుడ్స్ సంస్థల ప్రతినిధుల నుంచి రూ.50 లక్షలు తీసుకున్నారన్న అభియోగంపై ఆయనను ప్రశ్నిస్తున్నారు.