పోలీస్ స్టేషన్లో వందేమాతరం గీతాలాపన
NGKL: వందేమాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం అచ్చంపేట పోలీస్ స్టేషన్లో గీతాలాపన కార్యక్రమం జరిగింది. వారంతా కలిసి దేశభక్తిని చాటుతూ వందేమాతరం గీతాన్ని సామూహికంగా ఆలపించారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాస్, సీఐ నాగరాజు, ఎస్సై సద్దాం హుస్సేన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.