ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలి: ఎమ్మెల్యే
కాకినాడ: రక్తదానం ప్రాణదానంతో సమానమని కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం కాకినాడలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలన్నారు.