గౌరీ పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న MLA
VZM: కొత్తవలస మండలం గవరపాలెం గ్రామంలో గౌరీ పరమేశ్వరి అమ్మవారిని ఎస్. కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి శనివారం దర్శించుకున్నారు. గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు గ్రామస్థులందరు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో 5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ఆమె ప్రారంభించారు. గ్రామాల అభివృద్దే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు.