ఆన్‌లైన్ ఇసుక రవాణా బుకింగ్ వేగవంతం చేయాలి: కలెక్టర్
WGL: జిల్లా కలెక్టర్ డా. సత్య శారద కలెక్టర్ ఛాంబర్‌లో AD Mines ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “మా ఇసుక వాహన సేవ”పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇసుక వాహనాల ఆన్‌లైన్ బుకింగ్ విధానం పారదర్శకంగా, సులభంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేగవంతంగా సేవలు అందించాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు.