GNSS స్పెషల్ కలెక్టరుగా ఆదర్శ్ రాజేంద్రన్
అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ GNSS స్పెషల్ కలెక్టరుగా అదనపు బాధ్యతలను స్వీకరించారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు ఈ బాధ్యతలు నిర్వహించిన ఎస్. నీలమయ్య రిలీవ్ అవ్వడంతో, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదర్శ్ రాజేంద్రన్‌కు ఈ అదనపు బాధ్యతలు కేటాయించారు. కాగా, అన్నమయ్య జిల్లా జేసీ ఛాంబర్‌లో ఆయన ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు.