లావాదేవీల విషయంలో గొడవ.. విచక్షణా రహితంగా దాడి

లావాదేవీల విషయంలో గొడవ.. విచక్షణా రహితంగా దాడి

కృష్ణా: జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. పెదపారుపూడి మండలంలోని వెంట్రప్రగడకు చెందిన సయ్యద్‌ వలీ, ఫాతిమా అన్నాచెల్లెల్లు. గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య నగదు లావాదేవీల విషయంతో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా, ఫాతిమా, ఆమె ఇద్దరు కుమారులు వలీపై కర్రలు, రాడ్లతో విచక్షణా రహితంగా దాడిచేసి గాయపరిచారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.