తురిమెళ్ళలో వరి పంట పరిశీలన

తురిమెళ్ళలో వరి పంట పరిశీలన

ప్రకాశం: కంభం మండలం తురిమెళ్ల గ్రామంలోని వరి పొలాలను సహాయ వ్యవసాయ సంచాలకులు బాలాజీ నాయక్ సోమవారం పరిశీలించారు. దిత్వా తుఫాన్ ప్రభావం ఇంకా నాలుగు రోజుల పాటు కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించడంతో, రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ పంట కోతలను వెంటనే ప్రారంభించవద్దని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు పాల్గొన్నారు.