'అరిచి కాదు, ప్రశ్నలు అడిగితేనే ప్రజలకు ప్రయోజనం'

'అరిచి కాదు, ప్రశ్నలు అడిగితేనే ప్రజలకు ప్రయోజనం'

పార్లమెంట్‌లో గట్టిగా నినాదాలు చేస్తున్న విపక్ష ఎంపీలను ఉద్దేశించి లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా తీవ్రంగా హెచ్చరించారు. ఎంపీలు నినాదాలు చేసినంత దూకుడుగా ప్రశ్నలు అడిగితే ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వ ధనాన్ని ధ్వంసం చేయడానికి ప్రజలు వారిని ఎన్నుకోలేదని ఆయన పేర్కొన్నారు. తక్కువ అరిచి.. ఎక్కువగా ప్రశ్నలు అడగాలని ఆయన సూచించారు.