సిలిండర్ల కొరత.. కట్టెల పొయ్యిలే శరణ్యం
VKB: మర్పల్లి మండల కేంద్రంలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రం కావడంతో హోటల్ వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ సరఫరాలో అంతరాయం కలగడంతో చేసేది లేక మళ్లీ కట్టెల పొయ్యిలపై వంటలు వండుతున్నారు. కమర్షియల్ సిలిండర్లు దొరకడం కష్టసాధ్యంగా మారిందని, వ్యాపారం సాగక పొయ్యి కట్టెలే దిక్కయ్యాయని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.