తిరుమల శ్రీవారి ఆదాయం రూ. 3.43 కోట్లు
తిరుపతిలోని శ్రీవారి సర్వ దర్శనానికి టోకెన్ లేని భక్తులకు 8 గంటల సమయం పడుతున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో సోమవారం రోజున 70345 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. అంతేకాకుండా 24292 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీ వారి హుండీ ఆదాయం రూ. 3.43 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.