జవాన్ మురళి నాయక్ మృతికి ఎమ్మెల్యే నివాళి

KRNL: ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా జమ్మూ కశ్మీర్ యుద్ధభూమిలో పోరాడుతూ శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గడ్డంతాండ పంచాయతీకి చెందిన మురళి నాయక్ వీరమరణంపై శుక్రవారం పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు స్పందించారు. దేశ రక్షణలో మురళీ నాయక్ అనే సైనికుడు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన జవాన్‌కు ఘన నివాళులు తెలుపుతున్నానని పేర్కొన్నారు.