VIDEO: కనిగిరిలో ఏఐటీయూసీ మహాసభలో కదం తొక్కిన కార్మికులు
ప్రకాశం: కనిగిరిలో మార్కాపురం జిల్లా ఏఐటీయూసీ ప్రధమ మహాసభ సందర్భంగా బుధవారం ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యంలో కార్మికులు కదం తొక్కారు. పట్టణంలోని పీవీఆర్ పార్క్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ఎర్రజెండాలను చేత బూని కార్మికులు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర, జిల్లా నాయకులు మరియు పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు.