ట్రాక్టర్‌ను ఢీ కొన్న బైక్.. వ్యక్తికి తీవ్రగాయాలు
మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని మాదారం త్రీ ఇంక్లైన్ సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మాదారం వైపు వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి వచ్చిన బైక్ ఢీకొంది. ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తికి తలకు తీవ్రగాయం కాగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.